రిజిస్ట్రేషన్ లేని స్కూలు బస్సులు నడపొద్దు

రిజిస్ట్రేషన్ లేని స్కూలు బస్సులు నడపొద్దు

MBNR: భాష్యం విద్యానికేతన్ పాఠశాలకు చెందిన స్కూలు బస్సులు గత మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అయ్యేంతవరకు వాటిని ఆపాలని ఆ పాఠశాల ప్రిన్సిపల్ గారికి మరియు బస్సు డ్రైవర్లకు సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ చారి తగిన సూచనలు ఇచ్చారు. ఇట్టి విషయంలో నిర్లక్ష్యం వహించి బస్సులు నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.