నేడు జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు
కర్నూలు బి.క్యాంపు క్రీడా మైదానంలో ఇవాళ జిల్లా స్థాయి అండర్-19 విభాగంలో బాల బాలికల జట్లకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి పి.సువర్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరచి ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెల 9, 10 తేదీల్లో కదిరి పట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.