అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరు: వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడులో సివిల్ సప్లై అధికారులు గురువారం మెరుపు దాడులు చేశారు. గ్రామంలోని ఓ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని వారు గుర్తించారు. సుమారు 170 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.