VIDEO: బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం
కోనసీమ: అమలాపురం కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొని, మాట్లాడారు. ప్రజలకు అర్జీల తయారీపై అవగాహన కల్పిస్తూ, నిరక్షరాస్యుల తరఫున ఫిర్యాదులు రాసి అధికారులకు వివరిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.