ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే
SKLM: ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం పాత బస్టాండ్లో డీజీ లక్ష్మి ఆన్‌లైన్ సేవా కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా సులభంగా సౌకర్యవంతంగా సేవలందుతాయన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అందజేస్తున్న పథకాలను వినియోగించుకోవాలన్నారు.