రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్‌కు 15 మంది విద్యార్థుల ఎంపిక
MLG: హైదరాబాద్‌లో ఈ నెల 19-22 వరకు జరిగే రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు సన్ రైజర్స్ హైస్కూల్‌కు చెందిన 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ పెట్టం రాజు అభినందించారు. క్రీడలు శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం, సామాజిక నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.