శాసన సభ స్పీకర్‌ను కలిసిన గుంటూరు ఎస్పీ

శాసన సభ స్పీకర్‌ను కలిసిన గుంటూరు ఎస్పీ

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వకుల్ జిందాల్ బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని స్పీకర్ సూచించారు. జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.