రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి

NLR: బుధవారం నెల్లూరు నగరంలోని రైల్వే బ్రిడ్జిపై రైలు ఢీకొనడంతో పెన్నానదిలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్. హరిచందన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నీటి నుంచి బయటకు తీయించినట్లు పేర్కొన్నారు. మృతుడు 45-50 సంవత్సరాల మధ్య ఉండొచ్చని, తెలుపురంగు హాఫ్ హాండ్స్ షర్ట్, ధరించి ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.