VIDEO: అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

NZB: బోధన్ పట్టణంలోని షర్బతికినాల్ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కాలువ నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాలువకు ఇరువైపులా మరమ్మతులు చేపట్టి, ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.