VIDEO: చిన్నారిపై వీధి కుక్కల దాడి
HNK: హన్మకొండ నగరంలోని న్యూ శాయంపేటలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఆదివారం చిన్నారి వీధి గుండా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. దీనితో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. రోజు రోజుకు కుక్కల బెడద పెరుగుతోందని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.