VIDEO: 'దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం'
WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శైలజ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును మార్చేది పార్లమెంటు కాదని, పాఠశాల తరగతి గదేనని అన్నారు. అనంతరం విద్యార్థుల చేత ఓటర్ ప్రతిజ్ఞ చేయించగా, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.