ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 30 వరకు గడువు
అన్నమయ్య జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని DEO కె.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించనున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని DEO కోరారు.