ర్యాగింగ్ సరదా కాదు నేరం: SP
TPT: విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించడమే విద్య లక్ష్యమని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ర్యాగింగ్‌ను నిరోధించే లక్ష్యంతో SVU ఆడిటోరియంలో మంగళవారం 'యాంటీ - ర్యాగింగ్' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ర్యాగింగ్ అనేది సరదా కాదని అది ఒక నేరం అని SP అన్నారు. అనంతరం ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థి మనోభావాలను దెబ్బతీయడం సరికాదని హెచ్చరించారు.