బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి: SP
JGL: రేపు వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ తెలిపారు. బంద్ పేరుతో అవాంఛనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తారని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆయన అన్నారు.