అడవికులను సొసైటీని తనిఖీ చేసిన తహసీల్దార్

అడవికులను సొసైటీని తనిఖీ చేసిన తహసీల్దార్

ELR: నిడమర్రు మండలం అడవికొలను విశాల సహకార పరపతి సంఘంలో ఎరువుల గోడౌన్‌ను తహసీల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్, మండల వ్యవసాయ అధికారి అంగర్ ఆశీర్వాదం మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులో ఉన్న ప్రకారం ఎరువులు గోడౌన్లో ఉన్నాయా లేదని క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.