ఫలక్‌నుమా ప్యాలెస్.. ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం
HYD: నిజాం కాలంలో నిర్మించిన రాజభవనాల్లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఒకటి. దీనిని నిజాం ప్రధాని నవాబ్ వికారుల్ ఉమ్రా 1893లో తేలు ఆకారంలో ఇటాలియన్, టుడూర్ వాస్తు శైలిలో నిర్మించారు. 32 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్యాలెస్‌లో ఒకేసారి 101 మంది కూర్చొని భోజనం చేయగలిగే డైనింగ్ టేబుల్ ఉంది. 2000 సం.రంలో తాజ్ గ్రూప్ లీజుకు తీసుకుని తాజ్ ఫలక్ నుమా పేరిట విలాసవంతమైన హోటల్‌గా మార్చింది.