VIDEO: తెర్నేకల్ గ్రామంలో కాలువల దుస్థితి
KRNL: తెర్నేకల్ గ్రామంలో కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి పారుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల శుభ్రతపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు.