'పన్నుల వసూలుకు చర్యలు తీసుకుంటున్నాం'
MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో అన్ని రకాల పనుల వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామ ఈవో రాహుల్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ వివిధ కాలనీలకు వెళ్లి వ్యాపారులు, ప్రజల నుంచి పన్నులను వసూలు చేస్తున్నారన్నారు. ఇంటి, ఆస్తి, ట్రేడ్ లైసెన్స్, తదితర పన్నులను వసూలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.