ఫూలే, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహ ప్రాంగణంలో నూతన ఫూలే, అంబేద్కర్ విజ్ఞాన కేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో అధునాతన రీతిలో ఈ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ విజ్ఞాన కేంద్రంలో లక్షల కొద్ది పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.