B.Ed కోర్సు.. కాలేజీలో రిపోర్టుకు నేడే లాస్ట్

HYD: Ed.CET- 2025 ప్రవేశ పరీక్ష రాసి మొదటి ఫేజ్ అలాట్‌మెంట్ పొందిన వారు కాలేజీలో రిపోర్టు చేయడానికి నేడే లాస్ట్ తేదీగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో కాలేజీ వద్ద వెరిఫికేషన్ చేసుకుని, సబ్మిట్ చేయాల్సి ఉంటుందని, అలాట్‌మెంట్ ఆర్డర్ అందించాలని సూచించారు. త్వరలోనే సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.