గూగుల్ మ్యాప్స్‌లో RTC టికెట్ బుకింగ్
టికెట్ బుకింగ్‌లో APSRTC కొత్త విధానం తీసుకురానుంది. గూగుల్ మ్యాప్స్‌లో ఎక్కడికెళ్లాలో వెతికితే అటుగా తిరిగే RTC రిజర్వేషన్ సదుపాయం గల బస్సుల వివరాలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే తమ వెబ్‌సైట్‌లోకి వెళ్లేలా.. RTC ఇప్పటికే గూగుల్‌తో చర్చలు జరిపింది. HYD-VJA మార్గంలో ప్రయోగం విజయవంతమైన క్రమంలో వచ్చేవారం అన్ని రూట్లలో అందుబాటులోకి రానుంది.