'విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి'
KDP: పొరుమామిళ్ల పట్టణంలోని ZP ఉర్దూ హైస్కూల్‌ను ఇవాళ CI హేమ సుందర్ రావు సందర్శించారు. విద్యార్థులకు సమావేశం నిర్వహించి స్త్రీ, బాలికల భద్రత, రోడ్డు భద్రత, బాల్య వివాహాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.