నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

NZB: నగరంలోని డీ-4 సెక్షన్ D4 కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక సీజీఆర్ఎఫ్–2 ఏర్పాటు చేసినట్లు DE శ్రీనివాసరావు, ADE చంద్రశేఖర్ తెలిపారు. బోర్గాం, వినాయక్ నగర్, నాగారం సెక్షన్లకు చెందిన విద్యుత్ వినియోగదారులు సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ఉంటుందన్నారు.