చెక్కుల కోసం వచ్చి.. అనంతలోకాలకు

SDPT: జిల్లా కలెక్టరేట్ ఆవరణలో విషాదం చోటు చేసుకుంది. నష్టపరిహారం చెక్కుల కోసం వచ్చిన రైతు గుండెపోటుకు గురయ్యాడు. స్పందించిన అక్కడి వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గం మధ్యలో రైతు మరణించాడు. మృతుడు వెంకటాపూర్‌కు చెందిన గుండాల బాలకిట్టుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.