మలక్‌పేటలో 58 మందికి చెక్కుల పంపిణీ

మలక్‌పేటలో 58 మందికి చెక్కుల పంపిణీ

HYD: ముఖ్య మంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరంగా మారిందని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 58 మందికి చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన వారు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.