వనపర్తి మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
WNP: వనపర్తి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో ఉదయం 10 గంటలకు నూతనంగా ఎన్నికైన ఛైర్మన్ మాధవి రమేష్, వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని ఆమె ఛాంబర్లో భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.