ఎడపల్లి మండలంలో జోరుగా మొరం దందా

NZB: ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్సీ ఫారం, వడ్డేపల్లి గ్రామాల శివారులో మొరం దందా కొనసాగుతోంది. మొరం మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కనుసన్నల్లో గుట్టలు, కొండలను తవ్వేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరిట ముసుగు కప్పి మొరం దందాకు దర్జాగా తెరలేపుతున్నారు. ప్రకృతి సంపద హరించుకుపోతున్నా.. ప్రశ్నించాల్సిన అధికారులు, అడ్డుకోవాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది.