'జిల్లాలో ఐదు రోజులపాటు తేలికపాటి వర్షాలు'
ATP: జిల్లాలో వచ్చే ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు, రాత్రివేళలు 20 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పారు. వాయువ్య దిశగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని వివరించారు.