పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్
GDWL: జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్ రాజయ్య గురువారం సాయంత్రం శాంతినగర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్ రూమ్‌లను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు తప్పనిసరిగా మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులను ఆయన ఆదేశించారు.