అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం: ఎమ్మెల్యే
కోనసీమ: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహనీయుడు బాబు జగ్జీవన్ అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.