ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతూ మృతి

VZM: బొండపల్లి గ్రామానికి చెందిన నమ్మి గౌరి (68) ఈనెల 24వ తేదీన ద్వారపూడి వద్ద రైల్వే పనుల నిమిత్తం వెళ్ళగా ప్రమాదంలో గాయపడింది. గౌరిని వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గౌరి మంగళవారం మృతి చెందినట్లు కుమారుడు సంతోష్ తెలిపారు. పనులు చేస్తున్న సమయంలో రెండు రైళ్లు ఒకేసారి రావడంతో ప్రమాదం జరిగింది.