ఎరువుల గోదాముల్లో జేసీ ఆకస్మిక తనిఖీ

SKLM: ఆముదాలవలసలోని ఎరువుల గోదాములను శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి, మార్క్ ఫెడ్‌డీఎం, ఎమ్మార్వో, మండల వ్యవసాయ అధికారి కూడా ఉన్నారు. గోదాముల రికార్డులను జేసీ పరిశీలించి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.