నూతిలో పడి బాలుడి మృతి

SKLM: టెక్కలి మండలం గోపినాధపురానికి చెందిన బెండి దీపక్(16) అనే బాలుడు ఆదివారం నూతిలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. దీపక్ తన స్నేహితులతో కలిసి గోపీనాథపురం సమీపంలో ఉన్న నూతికి స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నూతిలో పడిపోయాడని తెలిపారు. దీంతో స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.