శ్రీ కనుమ పోలేరమ్మ అమ్మవారి రథోత్సవం
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారికి నిప్పు తెచ్చిన శ్రీ కనుమ పోలేరమ్మ ఆలయం వద్ద ఇవాళ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి మంగళ, శుక్ర, ఆది వారాలలో అమ్మవారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని మేనేజర్ ఈశ్వరయ్య చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.