అభివృద్ధి పనులపై అధికారుల పరిశీలన
KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న సిమెంట్ రోడ్లు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను ఆర్డీవో & మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఏ. చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ వి.వి. నరసింహారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.