మండల బీజేపీ అధ్యక్షుడు గూడూరు నాగప్ప మృతి
GDWL: గట్టు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు గూడూరు నాగప్ప బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో బీపీ (రక్తపోటు) పెరగడంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం మొదట గద్వాల ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అయితే, కర్నూలులో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.