రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: బూర్గంపాడు మండల పరిధిలో గురువారం మధ్యాహ్నం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బూర్గంపహాడ్ నుండి సారపాక వెళ్తున్న మార్గంలో ఈ ఘటన సంభవించింది. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వాహనదారుడికి తలపగిలి, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.