'డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి'
ASR: స్వర్ణాంధ్ర-2047లో భాగంగా వ్యవసాయంలో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం సూచించిన పంచ సూత్రాలు పాటించాలని జీకేవీధి ఏవో డీ.గిరిబాబు రైతులకు సూచించారు. ధారకొండ పంచాయతీ కమ్మరితోట, తోకరాయి గ్రామాల్లో శనివారం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. డిమాండ్ ఆధారిత పంటలు పండించాలని రైతులకు సూచించారు. నీటి భద్రత,ఫుడ్ ప్రాసెసింగ్ అత్యంత ముఖ్యమైనవన్నారు.