లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన MLA
KMR: భిక్కనూర్ రైతు వేదికలో లబ్ధిదారులకు MLA వెంకటరమణ రెడ్డి గురువారం చెక్కులు పంపిణీ చేశారు. 34 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులు పంపిణీ చేశారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయనతో పాటు తహశీల్దార్ సునీత, జీపీ సెక్రటరీ మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.