VIDEO: 'జనహిత పాద యాత్రను విజయవంతం చేయండి'

KNR: చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో ఈనెల 24న సాయంత్రం PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌ల పాదయాత్ర కొనసాగుతుందని మంత్రి పొన్న ప్రభాకర్ గురువారం KNRలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పాదయాత్రలో మంత్రులు, MLAలు పాల్గొంటారని చెప్పారు.