VIDEO: కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
KKD: సీ.రాయవరం వద్ద ఏలేరు కాలువలో పడి గల్లంతైన గిడుతూరి లోవరాజు మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో లోవరాజు నీటిలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యల అనంతరం మృతదేహం బయటపడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద స్థలంలో బంధువుల ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.