VIDEO: తొర్రూర్‌లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన
MHBD: తొర్రూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. సమ్మె నోటీస్ ఇచ్చి 41 రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదని వారు విమర్శించారు. ఇప్పటికైనా చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.