VIDEO: ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు
MDK: వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం పురస్కరించుకొని ఎల్లమ్మ తల్లికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. రంగురంగుల పూలమాలలు పట్టు వస్త్రాలతో అమ్మవారిని అందంగా అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు.