రెండో రోజు సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

రెండో రోజు సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండో రోజు పాల్గొననున్నారు. బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ఆయన ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 7 గంటలకు బోరబండ డివిజన్‌లో నిర్వహించే కార్నర్ మీటింగ్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం ఎర్రగడ్డ డివిజన్‌లోని సుల్తాన్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి జనప్రియ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు.