పారిశుద్ధ్య లోపంతో రోగాల వ్యాప్తి
VKB: కుల్కచర్ల మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు అంటు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య మరింత పెరిగిందని, అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తక్షణమే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి, వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.