నరకయాతనగా పెదకొడపల్లి-కుంతుర్ల ప్రయాణం
ASR: పెదబయలు పెదకొడపల్లి నుంచి కుంతుర్ల వెళ్లే మార్గం మట్టి, రాళ్లు, గుంతలతో నరకాన్ని తలపిస్తోంది. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండటంతో గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. కనీసం అంబులెన్స్ కూడా రాలేని ఈ దుస్థితిపై ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించి పక్కా రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.