1,903 మందికి ఉద్యోగాలు సంతోషకరం: సీఎం
సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హిందూపురంలో నిర్వహించిన జాబ్ మేళాలో 1,903 మందికి ఉద్యోగాలు రావడం సంతోషకరమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్యోగాలు పొందిన వారికి ఆయన అభినందనల తెలిపారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం పేర్కొన్నారు.