ప్రయోగాత్మకంగా ఏఐ కెమెరా ఏర్పాటు
CTR: జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కారానికి అటవీ శాఖ అధికారులు వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో AI కెమెరాలకు లౌడ్ స్పీకర్లను అనుసంధానం చేసి, లౌడ్ స్పీకర్ల ద్వారా తుపాకుల శబ్దం చేసేలా అమర్చారు. చిత్తూరు సమీపంలో ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇవాళ అధికారులు పలమనేరు, బైరెడ్డిపల్లి, వి. కోట, బంగారుపాలెం మండలాల్లోనూ ఈ పద్ధతిని అమలు చేయడానికి చర్యలు చేపట్టారు.