రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు

రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు వారాల్లో మాచర్ల కోర్టులో లొంగిపోవాలని నవంబర్ 28న ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు కోర్టులో లొంగిపోయేందుకు పిన్నెల్లి బ్రదర్స్ సిద్ధమయ్యారు. కాగా, టీడీపీ నేత హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఏ7 నిందితులుగా ఉన్నారు.