అయిజలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

GDWL: అయిజలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ బుధవారం నిరసన దీక్ష చేపట్టారు. జనాభా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్న అయిజలో సబ్ రిజిస్టర్ కార్యాలయం లేని కారణంగా మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు గద్వాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారి సౌకర్యార్థం అయిజలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.